వర్షాకాలం... అనారోగ్యాల కాలం అంటుంటారు పెద్దలు. నీళ్లు మారడం, వాతావరణం మారడం... ఇలా కారణం ఏదైనా కావొచ్చు... చాలామంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ కాలంలో బయట చల్లగా వర్షం పడుతుంటే లోపల వేడి వేడి పకోడీలు, బజ్జీలు తినడానికి, ఛాయ్ తాగడానికి చాలామందికి ఇష్టపడుతుంటారు. కానీ ఇలాంటి ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.
1. సీజనల్ పండ్లు, కూరగాయలు : వర్షాకాలంలో ఎక్కువగా లభించే అల్ల నేరేడు, ఆల్ బుకారా, చెర్రీలు, దానిమ్మ పండ్లు వంటి వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఈ పండ్లను తీసుకునేటప్పుడు కట్ చేసి పక్కన పెట్టడం ఆ తర్వాత తినడం కంటే ఒకేసారి పండును పూర్తిగా తినడం మంచిది. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా లభించే కూరగాయలు, ఆకుకూరలను వండుకొని తినడం మంచిది.
2. పెరుగు : పెరుగు జీర్ణ శక్తిని పెంచుతూ, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కడుపులోని హానికారకమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. పెరుగు, మజ్జిగలోని ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థకు మంచిది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ డి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పెరుగును ఆహారంలో తీసుకోవాలి.
4. అల్లం టీ : వర్షాకాలంలో అల్లం ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇందులో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు ఉండే అల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇది వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అందుకే వర్షాకాలంలో అల్లం టీ తాగేందుకు ప్రయత్నించాలి. లేదా అల్లం రసం, తేనె, గోరువెచ్చని నీళ్లు కలుపుకొని తాగవచ్చు.