Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..
Sleep: గాఢంగా నిద్రపోవాలనుకుంటున్నారా ?.. ఇలా చేస్తే మీ నిద్రకు ఇబ్బంది ఉండదు..
కొన్ని చిన్నపాటి అంశాలను కచ్చితంగా పాటిస్తే రాత్రి పూట గాఢమైన నిద్రలోకి జారుకోవచ్చు. తడిగా ఉండే పాదాలతో అస్సలు నిద్రపోవద్దు. కాళ్లు శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. తడిగా ఉన్న కాళ్లతో నిద్రిస్తే శరీరంలోని వేడి బ్యాలెన్స్ కాదు. కాబట్టి కాళ్లను ఎండిపోయేవరకు తుడుచుకుని నిద్రకు ఉపక్రమించాలి.
చాలామందికి నిద్రలో సమస్యలు వస్తుంటాయి. ఎంత శ్రమించినా.. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదనే మాటలు చాలామంది నుంచి వినిపిస్తుంటాయి. అయితే కొన్ని చిన్న విషయాలను పాటిస్తే... రాత్రిపూట గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.
2/ 7
తడిగా ఉండే పాదాలతో అస్సలు నిద్రపోవద్దు. కాళ్లు శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. తడిగా ఉన్న కాళ్లతో నిద్రిస్తే శరీరంలోని వేడి బ్యాలెన్స్ కాదు. కాబట్టి కాళ్లను ఎండిపోయేవరకు తుడుచుకుని నిద్రకు ఉపక్రమించాలి.
3/ 7
ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రించడానికి ప్రయత్నించాలి. పడుకోవడానికి ముందుకు ఎలక్రానిక్ వస్తువులను దూరం పెట్టాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.
4/ 7
నిద్రించడానికి ముందు ఫోన్ లేదా ల్యాబ్ టాప్ వంటివాటిని చూడటానికి బదులుగా పుస్తకాలు చదవాలి. ఇది తలకు మంచి ఉపశమనం అందిస్తుంది. న్యూస్ పేపర్ చదివినా మేలు కలుగుతుంది.
5/ 7
నిద్రించడానికి రెండు గంటల ముందు డిన్నర చేయాలి. పడుకోవడానికి నాలుగు గంటల ముందు కాఫీ లేదా టీ తాగాలి. ఈ రెండు నియమాలను కచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తే నిద్ర హాయగా పడుతుంది.
6/ 7
బెడ్ లేదా మాట్రస్ వంటివి కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి. అవి మంచిగా ఉండేలా చూసుకోవాలి. మంచి కంపెనీ మ్యాట్రస్ వాడటం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. నిద్ర బాగా పడుతుంది.
7/ 7
పడుకోవడానికి ముందే స్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది సుఖమైన నిద్రకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నిద్రపోవడానికి ముందు స్నానం చేయడం ద్వారా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది. ఈ రకంగా నిద్ర బాగా పట్టేందుకు దోహదపడుతుంది.