HEALTH EATING CURRY LEAVES WITH EMPTY STOMACH GIVES THESE HEALTH BENEFITS NS
Curry Leaves Health Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఎంతో మేలు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ ఖతం.. తెలుసుకోండి
Curry Leaves Benefits: కరివేపాకు కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి (Health) కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కరివేపాకును తింటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వారు వివరిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కరివేపాకులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి మరియు విటమిన్-ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం మరియు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు కరివేపాకులో ఇంకా చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నాయి.
2/ 6
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నిమ్మరసం, కరివేపాకు రసంలో చక్కెర కలిపి తాగడం ద్వారా వాంతులు, వికారం వంటి సమస్యలు పరిష్కారమవుతాయి.
3/ 6
ప్రతిరోజూ ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కరివేపాకు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కరివేపాకు లివర్ సిర్రోసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది
4/ 6
కరివేపాకు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు తినడం వల్ల కడుపు నొప్పులు తగ్గుతాయి మరియు మలబద్ధకం, అసిడిటీ మరియు అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగు లేదా మజ్జిగతో కరివేపాకు తీసుకోవడం చాలా మంచిది.
5/ 6
మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, ఒక్కసారి కరివేపాకు వాడండి. కరివేపాకు రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికోసం ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులతో కరివేపాకు తినండి.
6/ 6
కరివేపాకులో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.