HEALTH EATING AT THE WORK STATION WHAT ARE THE HEALTH PROBLEM MAY FACE HERE THE DETAILS VB
Eating at Work Place: వర్క్ ఫ్రం హోం చేస్తూ.. వాటిని తింటున్నారా.. అయితే జాగ్రత్త.. లేదంటే..
కరోనా కాలంలో ప్రస్తుతం ఐటీ ఉద్యోగులతో పాటు.. మరికొంత మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ నడుస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే కూర్చొని పని చేసుకునే క్రమంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోతున్నారు. దగ్గర్లో జంక్ ఫుడ్ పెట్టుకొని మరీ తినడం మొదలు పెట్టారు. దీంతో అనారోగ్యాలకు గురవుతున్నారు.
ఇలా అనవసర ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఇలా మన శరీరంలో కేలరీలు వెళ్లడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది.
2/ 5
అంతే కాకుండా పనిలో పడి.. తినే ఆహార సమయాల్లో కూడా తేడా వస్తుంటుంది. భోజనం సమయానికి తీసుకోకున్నా శరీరంలో అదనంగా కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
3/ 5
కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రోటీన్ మరియు కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇలా తీసుకోవడంతో ఆరోగ్యానికి ఎంతో మలు చేకూరుస్తుందని వైద్యులు చెబుతున్నారు.
4/ 5
అయితే.. కొన్నిసార్లు పనిలో తరచుగా శాండ్విచ్లు, బర్గర్లు వంటి జంక్ ఫుడ్‌కి అలవాటు పడుతుంటారు. వీటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమే మంచిది. లేదంటే ఇవి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
5/ 5
కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా విరామం తీసుకోవడానికి కూడా సమయం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో తప్పనిసరిగా ఒక ఐదు నిమిషాలు అయినా విశ్రాంతి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఒత్తిడి, అసిడిటీతో సహా మరి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.