Heart Attack : గుండెకు దానిమ్మ.. రోజూ ఎన్ని తినాలి.. ప్రయోజనాలేంటి?
Heart Attack : గుండెకు దానిమ్మ.. రోజూ ఎన్ని తినాలి.. ప్రయోజనాలేంటి?
Heart Attack : రోజూ హార్ట్ ఎటాక్ వార్తలు చూసి మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. జాగ్రత్తలు తీసుకుందాం. దానిమపండ్లు తెలుసుగా... అవి గుండెకు మేలు చేస్తాయి. కాకపోతే.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుందాం.
అరటి, జామ వంటి వాటితో పోల్చితే.. దానిమ్మపండ్ల ధర ఎక్కువే. కానీ అవి గుండెకు మేలు చేస్తాయి కాబట్టి.. వాటిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మను డైరెక్టుగా తినవచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఐతే.. పంచదార మాత్రం కలుపుకోవద్దు. ఒరిజినల్ రసమే తాగాలి.
2/ 9
దానిమ్మ చెట్లు ఇరాన్, ఇండియా నుంచి వచ్చాయి. ప్రపంచమంతా విస్తరింతాయి. కప్పు దానిమ్మ గింజల్లో 72 కేలరీలు ఉంటాయి. పిండిపదార్థాలు 16 గ్రాములు ఉంటాయి. ఇందులో ఫొలేట్, పొటాషియం, విటమిన్ కే కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
3/ 9
చాలా గుండె జబ్బులకు ప్రధాన కారణం.. ధమనుల్లో ఉండిపోతున్న కొవ్వు పదార్థం కొలెస్ట్రాల్ అని మనకు తెలుసు. ఈ కొలెస్ట్రాల్ అంత తేలిగ్గా కరగదు. దీన్ని కరిగించడం దానిమ్మ రసం వల్ల వీలవుతుంది. ఎందుకంటే.. దానిమ్మ వేడి చేసే రకం. ఈ వేడి వల్ల కొలెస్ట్రాల్ కరగగలదు.
4/ 9
రోజూ 3 దానిమ్మలు తింటే.. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 3 దానిమ్మలు అంటే కనీసం రూ.100 ఉంటాయి. అంటే నెలకు రూ.3వేలు ఖర్చవ్వగలదు. ఇది అదనపు ఖర్చులాగా అనిపించినా... కొలెస్ట్రాల్ ఉన్నవారు ఇలా చేస్తేనే మంచిదన్నది నిపుణుల మాట.
5/ 9
శరీరానికి వేడి చేసేవారు మాత్రం.. జ్యూస్ చేసుకొని.. గింజలు కాకుండా.. రసం మాత్రమే తాగడం మేలు. ఎందుకంటే.. ఈ గింజలు విపరీతంగా వేడి చేస్తాయి. వేడి ఎక్కువైతే జలుబు, దగ్గు, జ్వరం రాగలదు. కాబట్టి దానిమ్మ గింజల వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
6/ 9
దానిమ్మతో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిలో పోషకాలు ఎక్కువ. కేలరీలు తక్కువ. ఫ్యాట్ తక్కువ. విటమిన్స్, ఫైబర్ ఎక్కువ. అధిక బరువు ఉన్నవారు.. ఈ పండ్లను తీసుకుంటే.. బరువు త్వరగా తగ్గుతారు. జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది.
7/ 9
దానిమ్మలు త్వరగా ముసలితనం రానివ్వవు. వ్యాధుల నుంచి కాపాడతాయి. శరీరంలోని అధిక కొవ్వును.. ఐస్‌క్రీమ్‌లా కరిగించేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలా చేస్తాయి. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగేలా చేస్తాయి.
8/ 9
పిల్లలు పుట్టని వారు దానిమ్మలను తినాలి. సంతాన ప్రాప్తి కలిగిస్తాయి. మగవారిలో రతి కోరికలను బాగా పెంచే శక్తి దానిమ్మలకు ఉంది. ఇవి దాదాపు వయాగ్రాలా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
9/ 9
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.