జుట్టుపై అమితమైన కేర్ తీసుకునేవారు ఎక్కువవే ఉంటారు. అయినా, అనేక హెయిర్ కేర్ సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా మగవారికి బాల్డ్హెడ్ సమస్య. కొంతమందిలో అయితే, 30 దాటకముండే ఈ సమస్య వేధిస్తుంది. జుట్టు పెరుగుదలకు కొన్ని పోషకాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. దీంతో బట్టతల రాకుండా నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
పైనాపిల్..
పర్యావరణ కాలుష్యం ముఖాన్ని మాత్రమే కాదు.. జుట్టు మూలాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ బాల్డ్ హెడ్ సమస్యతో బాధపడుతున్నారు. పైనాపిల్లోని పుష్కలమైన విటమిన్ సీ, మెగ్నీషియం, విటమిన్ బీ6తోపాటు ఇతర ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఇవి మూల కణాలకు నష్టాన్ని సరిచేసి, జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి.
.యాపిల్..
జపాన్లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం యాపిల్ వెంటుకలపై కొత్త జుట్టు పెరగటానికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఇందులో విటమిన్ ఏ, బీ, సీ కూడా చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కణాలను తొలగిస్తాయి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )