రోజువారీ వ్యాయామం..
ప్రపంచంలోని అగ్రశ్రేణి అథ్లెట్లు కూడా వారి ఆరోగ్యానికి, ఎముకల పటిష్టతకు తమ వ్యాయామాన్ని కీలకమైన అంశంగా పేర్కొంటారు. రోజులో సగభాగం కేవలం వ్యాయామంలోనే గడిపే వారు చాలా మంది ఉన్నారు. వ్యాయామం, నడక, జాగింగ్ వంటి రోజువారీ కార్యకలాపాలు మీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడగలవని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్కువ కూరగాయలు, తక్కువ మద్యం..
విటమిన్ సి మీ ఎముక కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. వాటిని దెబ్బతినకుండా కాపాడుతుంది. కాబట్టి, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ముఖ్యంగా కూరగాయలు తీసుకోవాలి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)