HEALTH DO NOT EAT BANANA AFTER DINNER FOR TO AVOID THESE HEALTH ISSUES NS
Health Tips: భోజనం తర్వాత అరటి పండు తినేవారికి అలర్ట్.. ఆ ఆరోగ్య సమస్యలు.. తెలసుకోండి
Banana Health Benefits: అరటిపండు మనకు సులభంగా లభించే పండ్లలో ఒకటి. తక్షణ శక్తిని ఇచ్చే ఈ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని పోషకాలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే.. రాత్రి భోజనం తర్వాత అరటి పండు తినకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అరటిపండులో సహజసిద్ధమైన యాంటాసిడ్లు ఉంటాయి. ఇది కడుపు సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా అరటిపండులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
2/ 5
రాత్రి భోజనం చేసిన తర్వాత అరటిపండు తింటే జలుబు, దగ్గు వస్తుంది.
3/ 5
పెద్ద అరటిపండు జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. నిద్రవేళకు 2 నుండి 3 గంటల ముందు ఈ పండును తినడం మంచిది.
4/ 5
జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండ్లు తినకూడదు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది జలుబు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
5/ 5
రాత్రిపూట అరటిపండు తీసుకోవడం తగ్గించండి. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది, ముఖ్యంగా మీరు రాత్రి నిద్రించడానికి ముందు ఈ పండును తీసుకోకండి.