మొలకెత్తిన ఆలుగడ్డలు/ బంగాళాదుంపలు : ప్రతీ కిచెన్ లో కనిపించే కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి అని చెప్పవచ్చు. కూరల నుంచి స్నాక్స్ వరకు బంగాళదుంపను చాలా వాటిలో విరివిగా వాడుతుంటారు. అయితే బంగాళాదుంపలను ఎప్పుడూ కూడా మంచిగా ఉడికించాలి. బంగాళాదుంపలు మొలకెత్తడం ప్రారంభిస్తే.. వాటిపై ఆకుపచ్చ కలర్ లో మచ్చలు ఏర్పడుతుంటాయి. ఈ ఆకుపచ్చ మచ్చల నుంచి సోలనిన్(solanine) అనే విషం ఉత్పత్తి అవుతుంది. బంగాళాదుంపలపై చిన్న ఆకుపచ్చ బుడిపెలాగా లేదా మచ్చలు కనిపిస్తే వాటిని సరిగా ఉడికించండి. లేదంటే కడుపులోకి సోలనిన్ విషం ప్రవేశిస్తుంది.
సొరకాయ (Bottle gourd) : సొరకాయ జ్యూస్, సొరకాయ కూర చాలామంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. బరువు తగ్గడం, బ్లడ్ షుగర్ తగ్గించడానికి అవసరమైన విరుగుడు (antidote) పదార్థాలు సొరకాయలో ఉంటాయని చెబుతుంటారు. అయితే ఇది బాగా ఉడికించినప్పుడే తినాలి. లేదంటే ఒక జ్యూస్ లాగా చేసుకొని తాగాలి. ఒకవేళ సొరకాయ సరిగా ఉడికించకపోతే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కస్సావా (Cassava) లేదా టొపియోకా(Tapioca) : కస్సావా అనేది ఒక రకమైన జాతి చెట్టు దుంపలు/వేర్లు. కొందరు భారతీయులు దీన్ని ఎక్కువగా వంటకాల్లో వాడతారు. అయితే దీన్ని తప్పనిసరిగా నానబెట్టాలి లేదా వాడే ముందు చక్కగా ఉడికించాలి. పచ్చి టోపియోకా సైనైడ్ అనే విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ప్రాణాంతకమైన విషం. అందుకే ఈ దుంప విషయంలో జాగ్రత్త వహించండి.