ఎండుద్రాక్షలో రాగి, విటమిన్-B పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. వీటిని తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎండు ద్రాక్ష మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎండు ద్రాక్ష జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చలికాలంలో తీసుకోవడం చాలామంచిది. దీనివల్ల బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోలేరు. తద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు రోజువారిగా తగిన మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి. వీటిలోని ఫినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
నాన బెట్టిన ఎండుద్రాక్షను ఎందుకు తినాలి.. ఎండుద్రాక్ష కంటే నానబెట్టిన ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నానబెట్టిన ద్రాక్ష నీటిని తాగడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎందుకంటే.. ద్రాక్షలో ఉంటే పోషకాలన్ని ఆ నీటిలో కరిగిపోతాయి. అందుకే ఆ నీటిని తాగడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. . (Disclaimer: ఈ ఆర్టికల్లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.)