కూరలో అన్నేసి చూడు..నన్నేసి చూడు అనే ఉప్పు సామెత అక్షరాల సత్యం. ఎందుకంటే కూరలో సరైన మోతాదులో ఉప్పు లేకపోతే ముద్ద దిగదు. కనీస మోతాదులో ఉప్పు ఉంటేనే కూర కూడా రుచిగా అనిపిస్తుంది. ప్రతి వంటకంలో ఉప్పు తప్పనిసరి అవడం వల్ల మనకు తెలియకుండానే అధిక మొత్తంలో తినేస్తున్నాం. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నాం.