ఇక గర్భం ప్లాన్ చేసే చాలా మంది మహిళలు శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయరు. అయినప్పటికీ, స్త్రీ జననేంద్రియ నిపుణులు ప్రతిసారీ శృంగారం తర్వాత మూత్ర విసర్జనను సిఫార్సు చేస్తారు. మీరు గర్భవతి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా...అయితే సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయాలా? వద్దా...లేకపోతే అలా చేస్తే గర్భవతిగా ఉండగలరా? లేదా అనేది వివరంగా తెలుసుకుందాం ...
కలయిక తర్వాత స్పెర్మ్ లీక్ కావడం సాధారణమే. ప్రతి స్ఖలనంలో 20 నుండి 400 లక్షల స్పెర్మ్ ఉంటుంది. స్ఖలనం అయిన వెంటనే, 35 శాతం స్పెర్మ్ వీర్యం నుండి వేరుచేసి గర్భాశయంలోకి వెళుతుంది. స్పెర్మ్ ఒక నిమిషం లోపల పునరుత్పత్తి మార్గము ద్వారా ఫెలోపియన్ గొట్టంలోకి కదులుతుంది. వీటిలో కొన్ని స్పెర్మ్ యోని యొక్క పృష్ఠ ఫోర్నిక్స్లో ఉంటుంది, కొంత స్పెర్మ్ నశించిపోతుంది.
మిగిలిన స్పెర్మ్ యోని నుండి ప్రోటీన్ మరియు విటమిన్ అధికంగా ఉండే ద్రవాలతో విడుదలవుతుంది. శృంగారం తర్వాత యోని నుండి పెద్ద మొత్తంలో ద్రవం బయటకు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీర్యంలో 10 శాతం మాత్రమే స్పెర్మ్. మీరు మూత్ర విసర్జన చేసినప్పటికీ ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే అప్పటికే స్పెర్మ్ గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది.
శృంగారం తర్వాత బాత్రూంకు వెళ్ళకపోయినా చాలా సార్లు స్పెర్మ్ యోని నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది. కానీ ఇది గర్భధారణ అవకాశాన్ని కూడా ప్రభావితం చేయదు.శృంగారం తరువాత, మీరు యోని లోపల స్పెర్మ్ ఉంచడానికి పడుకోవడం, కాళ్ళు ఎత్తడం లేదా ఏదైనా ప్రత్యేకమైన పని చేయవలసిన అవసరం లేదు. అనేక పరిశోధనలలో ఇది పూర్తిగా తప్పు అని నిరూపించబడింది.