Pregnent Womens: గర్భిణీ మహిళలు కీరదోసకాయలు తినొచ్చా?
Pregnent Womens: గర్భిణీ మహిళలు కీరదోసకాయలు తినొచ్చా?
సమ్మర్ అనగానే టక్కున గుర్తొచ్చే వాటిలో పుచ్చకాయ, కీరదోస ముందుంటాయి. ఇందులో 96 శాతం నీరు ఉండడంతో శరరం డిహైడ్రేట్ కాకుండా చర్మానికి రక్షణ ఇస్తుంది. ఎండాకాలంలో కీరదోస ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు. మరి గర్భిణీ మహిళలు కీరదోసకాయలు తినొచ్చా? లేదా?
సమ్మర్ అనగానే టక్కున గుర్తొచ్చే వాటిలో పుచ్చకాయ, కీరదోస ముందుంటాయి. ఇందులో 96 శాతం నీరు ఉండడంతో శరరం డిహైడ్రేట్ కాకుండా చర్మానికి రక్షణ ఇస్తుంది. ఎండాకాలంలో కీరదోస ప్రయోజనాలు అన్నీ ఇన్నీకావు.
2/ 9
అయితే కీరదోస అందరూ తినొచ్చా అనే సందేహం ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకొనే ఆహరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. ప్రతీది తినే ముందు ఇది తినొచ్చా లేదా అనే సందేహం వారిలో ఉంటుంది.
3/ 9
మరి కీరదోస గర్భిణీలు తినొచ్చా. ఇవి గర్భిణీలకు ఏ విదంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
4/ 9
కీరదోసలో పొటాషియం,కాల్షియం, ఇనుము, విటమిన్ కె, విటమిన్ సి, జింక్ సహా అనేక రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి పిండం పెరుగుదలకు చాలా దోహదపడతాయి.
5/ 9
అలాగే విటమిన్ B6, విటమిన్ B9 అనే ఫీల్ గుడ్ విటమిన్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి..మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా తరచూ ఆందోళన చెందే గర్భిణీలకు అత్యంత ప్రయోజనకరం.
6/ 9
దోసకాయ తినడం వల్ల రక్తపోటు సమస్యలు వుండవు. గర్భధారణ సమయంలో రక్తపోటు సరిగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటుంది.
7/ 9
గర్భిణీల్లో హార్మోన్ల సమస్య వల్ల ఎక్కువగా రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం వుంది. అందుకే దోసకాయ తినడం వల్ల కొంత కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు.
8/ 9
ఇంకో విషయం ఏంటంటే..దోసకాయను ఎక్కువగా తినకూడదట. ఎందుకంటే ఇందులో ఉప్పు, నీరు ఎక్కువగా ఉంటుంది.
9/ 9
దీనివల్ల తరచు మూత్రం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటిని లిమిట్ గా తింటేనే ప్రయోజనమని చెబుతారు.