ఏకంగా తల్లిపాలతోనే ఇలాంటి ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నాయి. చిన్నారులకు పాలు పట్టించే వరకు వీటిని తల్లులు సింబాలిక్‌గా ధరిస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి తల్లి పాల నగల గురించి వినడం చాలామందికి ఇదే మొదటిసారి కావచ్చు. కానీ బెస్ట్ మిల్స్ వంటి ఆర్గానికి పదార్థాన్ని కలిగి ఉన్న ట్రింకెట్లు, వేరబుల్ ప్రొడక్ట్స్ పాశ్చాత్య దేశాల్లో చాలా ఫేమస్ అవుతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం (image credit : face book)
విక్టోరియన్ శకంలో చెవిపోగులు, బ్రోచెస్‌లను మనుషుల జుట్టు నుంచి తయారు చేసేవారు. ఇటీవలి కాలంలో ఆశ్చర్యంగా మృతదేహాలను దహనం చేసిన తరువాత మిగిలే బూడిద నుంచి సింథటిక్ వజ్రాలను తయారు చేస్తున్నారు. నవజాత శిశువుల బొడ్డు తాడు, శిశువుల దంతాలను సేవ్ చేయడం అనేది ఇప్పుడు చాలా దేశాల్లో సాధారణ విషయంగా మారింది. ఈ జాబితాలో బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ చేరాయి.(image credit : face book)
ప్రత్యేకంగా కంపెనీలు
పాలు పట్టించే తల్లులు తమ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ జ్యువెలరీ తయారు చేయించుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు సైతం పనిచేస్తున్నాయి. ఉదాహరణకు.. పార్టిడా గ్రేస్ అనే అమెరికన్ మహిళ తన కోసం ప్రత్యేకంగా ఒక బ్రెస్ట్ ఫీడింగ్ లాకెట్ తయారు చేయించుకోవాలనుకుంది. (image credit : face book)
మహిళలు ప్రసవం తరువాత తమ పిల్లలకు పాలు పట్టించే పీరియడ్‌ను వారి జీవితంలో చాలా ప్రత్యేకమైన, ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారు. కీప్‌సేక్స్ కంపెనీ యజమాని సారా కాస్టిల్లో ఈ విషయంపై న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ, తన క్లయింట్లు చాలామంది నర్సింగ్‌లో ఇబ్బంది పడిన తరువాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జ్యువెలరీని ఆర్డర్ చేస్తున్నట్లు చెప్పారు. (image credit : face book)
తల్లిపాల నుంచి నగలు ఎలా తయారు చేస్తారు?.. కాస్టిల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ప్రొడక్ట్స్ చూసి ఇన్స్పైర్ అయినట్లు తెలిపారు. తరువాత ఈ ఏడాది మార్చి నుంచి ఇలాంటి జ్యువెలరీపై పనిచేయడం ప్రారంభించారు. తన సొంత బ్రెస్ట్ మిల్స్‌పై ప్రయోగాలు చేస్తూ వివిధ రకాల వేరబుల్ ప్రొడక్ట్స్ తయారు చేశారు. (image credit : face book)
ముందు తన బ్రెస్ట్ మిల్స్‌ను డీహైడ్రేట్ చేసి పొడిగా మార్చారు. ఆ పౌడర్‌ను రెసిన్ అనే కెమికల్‌తో కలిపి ఒక రాయిగా తయారు చేశారు. వాటిని వేరబుల్ లాకెట్లుగా మారుస్తూ, ఆకట్టుకునే ఫినిషింగ్‌తో జ్యువెలరీగా మార్చారు. ఇలాంటి ఒక్కో లాకెట్ ధర $60 నుంచి $150 వరకు ఉంటుందట. అంటే మన కరెన్సీలో రూ.4,500 నుంచి రూ.11,000 వరకు ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్‌ను చాలామంది సెంటిమెంట్‌గా ధరిస్తున్నారని చెబుతున్నారు కాస్టిలో. (image credit : face book)
ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసేందుకు ప్రత్యేకంగా కంపెనీలు వెలుస్తున్నాయి. వివిధ సంస్థలు ప్రత్యేకంగా ప్రొఫెషనల్స్‌ను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 4,000 బ్రెస్ట్ మిల్స్ జ్యువెల్స్ అమ్మినట్లు చెప్పారు మమ్మాస్ లిక్విడ్ లవ్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆన్ మేరీ షరూపిమ్. (image credit : face book)
అయితే ఈ బ్రెస్ట్ మిల్స్ జ్యువెల్స్ చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా నీటిలో తడపకూడదట. రసాయనాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సలహా ఇస్తున్నారు. తమ క్లయింట్స్ అయిన లాక్టేటింగ్ మదర్స్‌కు వీరు కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. రొమ్ము పాలను ఎలా సేకరించాలి, ఎంతమొత్తంలో సేకరించాలి, వాటిని తమ కంపెనీకి ఎలా చేరవేయాలి.. వంటి అంశాలను కంపెనీలు తల్లులకు వివరిస్తున్నాయి.(image credit : face book)