పండ్లలో బొప్పాయి టేస్టే వేరు. తింటుంటే.. మనకు తెలియకుండానే నోట్లో అలా అలా జారిపోతుంది. సరిగ్గా పండితే.. ఆ రుచి మనం ఎప్పటికీ మర్చిపోలేం. పైగా దాని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. ఆసియా ప్రజలు బొప్పాయిని ఎక్కువగా తింటారు. బొప్పాయిలో A, C, E విటమిన్స్ ఉంటాయి. ఇవి స్కిన్‌ని కాపాడుతాయి. ఐతే.. బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియవు. అందువల్లే గింజలు పారేస్తుంటారు.
బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యకరమైనవే. వీటి పైన జిగురు లాంటి పదార్థం ఉంటుంది. ఇవి కొద్దిగా కారం, చేదుగా ఉంటాయి. వీటిని ఎండబెట్టి.. మిక్సీలో పొడిలా చేసి తినవచ్చు. బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్ ఉంటాయి. ఇంకా జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంచుతాయి.