కేవలం పల్లెల్లో మాత్రమే కనిపించే ముంజులు నగరాలు, పట్టణాల్లో విరివిగా లభించడంతో నగర వాసులు మంజుల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐస్ యాపిల్స్ గా పిలవబడే ఇవి మెట్ట ప్రాంతాలైన గ్రామాల నుంచి సేకరిస్తున్నారు వ్యాపారులు. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవిలో తాటి ముంజుల విక్రయాలు కాస్తంత ఊరటనిస్తుందని అంటున్నారు.