శోభనం రోజున తమలపాకు పాన్ తినడం వల్ల మగాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతోంది. తమలపాకులో Anti-inflammatory, డియోడరెంట్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫెక్టివ్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మగవారిలో Testosterone hormone levels పెరుగుతాయి. అందుకే కొత్తగా పెళ్లిచేసుకున్న పురుషులు తమలపాకు పాన్ తీసుకోవాలని పెద్దలు చెప్తుంటారు.
మలబద్దకంతో బాధపడేవారికి తమలపాకు చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. మలబద్దకం సమస్య ఉన్న వారు భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే ఈ సమస్యనుంచి బయటపడతారు. అలాగే ఒక గ్లాసు నీళ్లను తీసుకుని అందులో తమలపాకును చిన్న చిన్నముక్కలుగా చేసి వేయాలి. వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం పరిగడుపున తాగాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటిస్తే మీ సమస్యలన్నీ మటుమాయం అవుతాయి.