Slap Therapy: రోజుకు 50 చెంప దెబ్బలు.. ఆ అందగత్తెల సౌందర్య రహస్యం ఇదేనట
Slap Therapy: రోజుకు 50 చెంప దెబ్బలు.. ఆ అందగత్తెల సౌందర్య రహస్యం ఇదేనట
Slapping therapy | Beauty tips : అందంగా మారడం ఎలా? ఈ ప్రశ్నకు ఎన్నో సమాధానాలున్నాయి. సబ్బులు, క్రీములు, లోషన్లు, నూనెలు...ఇలా ఉన్నాయి. మరికొందరైతే ఎక్కువగా నీరు తాగితే సౌందర్యం పెరుగుతుందని నమ్ముతారు. కానీ దక్షిణా కొరియా మహిళలు ఏం చేస్తారో తెలుసా? చెంప దెబ్బలు వేసుకుంటారు.
దక్షిణ కొరియాకు చెందిన మహిళలు అందం కోసం వెరైటీ థెరపీని ఫాలో అవుతున్నారు. ఇదేదో ఈ మధ్య వచ్చింది కాదు. వంద ఏళ్లుగా ఆచరిస్తున్నారు. అదేంటేంట.. స్లాప్ థెరపీ (చెంప దెబ్బల చికిత్స). ఇలా చేస్తే ముఖం అందంగా మారుతుందట. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
చెంప దెబ్బ అంటే.. లాగి పెట్టి బలంగా కొట్టడం కాదు. అలాగని మరి సుతిమెత్తగా కూడా కాదు. రెండు చెంపలను రెండు చేతులతో మోస్తరు బలంతో బాదుకుంటే చాలు. అదే స్లాప్ థెరపీ. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
మొదట కొరియాలో మాత్రమే ఇది కనిపించేది. కానీ దాని వల్ల నిజంగానే మంచి ఫలితాలు వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చెంప దెబ్బలు కొట్టుకొని మహిళలు అందంగా మారుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇది మూఢ నమ్మకం ఎంత మాత్రమూ కాదంటున్నారు నిపుణులు. దీని వెనక సైన్స్ ఉందని చెబుతున్నారు. చెంప దెబ్బ తగిలినప్పుడు ముఖానికి రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా చర్మం కాంతివంతమవుతుంది. మృదువుగా మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అందుకే కొరియాలో మహిళలంతా స్లాప్ థెరపీని ఫాలో అవుతారు. చిన్నప్పటి నుంచే అలవాటుగా మార్చుకుంటారు. కేవలం మహిళలే కాదు పురుషులు కూడా చెంప దెబ్బలు కొట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల కొరియన్ల ముఖాలు కాస్త ఎర్రగా, తాజాగా కనిపిస్తాయట. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
స్లాప్ థెరపీని యాంటీ ఏజింగ్ థెరపీ కూడా భావిస్తారు. చెంప దెబ్బలతో చర్మం సున్నితంగా మారుతుంది. వయసు పెరుగుతున్నా చర్మంపై ముడతలు రావు. అందకే ఈ థెరపీతో వయసు తగ్గుతుందని కూడా కొరియన్స్ చెబుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కొరియన్ మహిళలు రోజుకు 50 చెంప దెబ్బలు కొట్టుకుంటారు. కొందరైతే కాస్త గట్టిగానే స్లాప్ చేసుకుంటారు. తద్వారా రక్త ప్రసరణ బాగా పెరిగి.. ముఖ కండరాలు ధృడంగా మారుతాయి. అప్పుడ చర్మం బిగుతుగా ఉండి చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)