ఎసిడిటీ ఈ రోజుల్లో చాలా మందిలో కనిపిస్తోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు వస్తున్నాయి. మన కడుపులో ఉత్పత్తి అయ్యే కొన్ని యాసిడ్లు జీర్ణవ్యవస్థలో క్రియాశీలకంగా పనిచేస్తాయి. ఐతే ఇవి అధికంగా ఉత్పత్తి అయితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. తద్వారా మనం తినే ఆహార పదార్థాలు సరిగ్గా అరగవు.(ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల చాలా మంది వేపుళ్లను తింటున్నారు. కానీ అది మంచిది కాదు. వేయించిన ఆహార పదార్థాల వల్ల అజీర్తి, శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోవడం, ఎసిడిటీ, గుండెజబ్బులు వంటి ప్రమాదాలు రావచ్చు. అందువల్ల ఫ్రై చేసిన పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. దీనికి బదులుగా కాల్చిన లేదా ఉడికించిన ఆహారాన్ని తింటే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
అదేపనిగా ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల కడుపులో ఎసిడిటీ వస్తుంది. సాధారణంగా ఉద్యోగాలు చేసేవారు రోజులో ఏడు నుంచి తొమ్మిది గంటలు కంప్యూటర్, ల్యాప్టాప్ల ముందు కూర్చోవాల్సి వస్తోంది. ఐతే అప్పుడప్పుడూ గ్యాప్ తీసుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కుర్చీ నుంచి లేచి అటూ ఇటూ నడవాలి. (ప్రతీకాత్మక చిత్రం)