వీరిని సింపుల్‌గా మ్యాన్ చైల్డ్ (man-child) అని అంటారు. ఐతే ఒక్కోసారి ఆడవారు మగవారితో డేటింగ్ చేసేటప్పుడు.. "నా డేటింగ్ పార్ట్నర్ చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తిస్తున్నాడేంటి? ఇతన్ని పెళ్లి చేసుకోవాలా వద్దా?" అనే అనుమానాలతో సతమతమవుతుంటారు. ఇలాంటి పరిస్థితి రావడానికి రెండు కారణాలు ఉండవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
మొదటిది, అతను మీలాగా ఎక్కువ ఒత్తిళ్లకు లోనుకాకపోవచ్చు కాబట్టి అతను అన్ని విషయాల్లో కూల్‌గా కనిపిస్తాడు. రెండవది అతను పైకి మగవాడిలా ఉంటూ లోపల పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉండొచ్చు. మీరు సరేనంటే తప్ప ఏ స్త్రీ కూడా ఇలాంటి ఇమ్మెచ్యూర్ వ్యక్తిని పెళ్లి చేసుకోదు. అయితే అతడు కూల్‌గా ఉన్నాడా లేకపోతే నిజంగానే చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగి ఉన్నాడా? అనేది 7 సంకేతాలు తెలుపుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
పదేపదే సాకులు చెప్పడం
అతను తప్పులు చేస్తూ ప్రతిదానికీ సాకులు చెబుతున్నాడు? ప్రతిసారీ విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడా? తానే బాధితుడని చెప్పడానికి అతనికి ప్రతిసారీ సాకు దొరుకుతుందా? ఇలాంటి లక్షణాలన్నీ చిన్నపిల్లవాడి మనస్తత్వాన్ని తెలిపేవే. ఈ తరహా తత్వం గల మగవారు బాధ్యతారహితంగా ఉంటారు. మీరు వీరిని మార్చలేరు. ఎందుకంటే ఈ లక్షణం వారికి లోపల నుంచి ఆటోమేటిక్ గా వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మురికిగా ఉండటం.. మీ పార్ట్నర్ తన గది నీట్ గా మెయింటైన్ చేస్తున్నాడా? లేక కాలేజీ కుర్రాడిలాగా అన్ని వస్తువులను చిందరవందరగా పడేసి గదిని మురికిగా ఉంచుతున్నాడా? అనే విషయాన్ని మీరు గమనించాలి. మీ పార్ట్నర్ తన రూమ్ ని మరీ అపరిశుభ్రంగా ఉంచుకుంటే వారు చిన్న పిల్లవాడి మనస్తత్వం ఇంకా వదులుకోలేదని మీరు అర్థం చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం
ఒకవేళ మీ పార్ట్నర్ విద్యార్థి అయినా లేదా ఏదైనా వైద్య సంక్షోభంలో ఉన్నా.. వారి దగ్గర డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ అతను అన్ని సమయాలలోనూ ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే మీరు జాగ్రత్త పడాలి. పరిపక్వతతో ఉన్న మగవారు కచ్చితంగా డబ్బు ఆదా చేస్తారు. తన బిల్లులను తాను చెల్లించుకోగడుగుతాడు. అలా కాకుండా అప్పుల ఊబిలో చిక్కుకొని బాధ్యతారాహిత్యంగా ఉంటే మీరు దీన్ని సీరియస్‌గా పరిగణించాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
బేసిక్ బాధ్యతలు లేకపోవడం
కొన్ని ప్రాథమిక బాధ్యతల కూడా సక్రమంగా నిర్వర్తించలేక మిమ్మల్ని ప్రతిసారీ నిరాశకు గురి చేస్తున్నట్లయితే.. మీరు వారిని సున్నితంగా తిట్టడం చేస్తుంటారు కదా. అయితే మీరు ఇలా తరచుగా తిడుతున్నట్లయితే.. దీని అర్థం అతను మ్యాన్-చైల్డ్ అని! మీ విషయంలో ఇదే జరిగితే వెంటనే ఇలాంటి వ్యక్తులతో డేటింగ్ మానేయాలని రిలేషన్ షిప్ సలహాదారులు చూపిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)