వేసవిలో చాలామందికి చెమట ఎక్కువగా పడుతుంటుంది. చెమట, దుమ్ము ఇతర మలినాలు చర్మానికి అంటుకుంటాయి. దీంతో ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే చర్మ సంరక్షణ కోసం ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి సహాయపడతాయి. కొన్ని ఫేస్ ప్యాక్‌లు జిడ్డు చర్మానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్. ముల్తానీ మిట్టి దీని గురించి అమ్మాయిలందరికీ తెలిసే ఉంటుంది. మల్తానీ మిట్టీ.. రోజ్ వాటర్ తీసుకోండి. ఒక గిన్నెలో ఒక చెంచా ముల్తానీ మిట్టి 2 చెంచాల రోజ్ వాటర్ కలపండి. చర్మం మరియు మెడ ప్రాంతానికి అప్లై చేయండి . ఆరిన తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.