1. ఐస్‌క్యూబ్‌తో మొటిమలు మాయం
ముఖంపై ఎర్రగా అయ్యి మంటగా అనిపించే మొటిమలను ఐస్‌క్యూబ్‌లతో కూల్ చేయవచ్చు. ఇందుకు ముందుగా మీరు ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని ఐస్‌క్యూబ్‌లను వేయండి. తర్వాత ఆ వస్త్రాన్ని నాలుగు నిమిషాల పాటు మొటిమలపై సాఫ్ట్ గా మర్దనా చేయండి. ఇలా చేయడం ద్వారా స్కిన్ పై బ్లడ్ సర్కులేషన్ పెరిగి మంట, దురద, ఎరుపుదనం, ఉబ్బు లాంటివి మటుమాయమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. చూర్ణం చేసిన ఆస్పిరిన్ టాబ్లెట్ల పేస్ట్‌తో మొటిమలకు చెక్
ఆస్పిరిన్‌లో సాలిసిలిక్ యాసిడ్ (Salicylic Acid) ఉంటుంది. ఇది ఎక్సెస్ ఆయిల్ (excess oil), డెడ్‌స్కిన్‌ను తొలగించడంలో అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. పేస్ట్ తయారు చేసే ముందు... మీరు ఒకటి లేదా రెండు ఆస్పిరిన్ మాత్రలను చూర్ణం చేయాలి. ఈ చూర్ణంలో కొన్ని వాటర్ డ్రాప్స్ కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్‌ను నేరుగా మొటిమలపై అప్లై చేయండి. ఇది వాపు, ఎరుపును, మొటిమల తీవ్రతను తగ్గిస్తుంది. ఈ పేస్ట్‌ను 10 - 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. యాక్నే స్పాట్ ట్రీట్మెంట్
యాక్నే నయం చేసే ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే ముందు రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే యాక్నే ప్రొడక్ట్స్‌లో సాలిసిలిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే, బెంజాయిల్ పెరాక్సైడ్ (Benzoyl Peroxide) కలిగిన యాక్నే ట్రీట్మెంట్ ప్రొడక్ట్స్‌ని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సాలిసిలిక్ యాసిడ్ లేదా బెంజాయిల్ పెరాక్సైడ్ గల ప్రొడక్ట్స్‌తో మొటిమల సమస్యను ఈజీగా పోగొట్టవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
బెంజాయిల్ పెరాక్సైడ్ ఆయిలీ స్కిన్‌ని తగ్గించి డెడ్స్కిన్ సెల్స్ తొలగించి, మొటిమలకు దారితీసే బ్యాక్టీరియాను కిల్ చేస్తుంది. ఈ రెండూ కలిగిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు 0.5 - 2% సాలిసిలిక్ యాసిడ్ కలిగిన ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడినప్పుడు సూర్యరశ్మిలో తిరగకూడదు.(ప్రతీకాత్మక చిత్రం)
4. మేకప్ తో మొటిమలను దాచేయండి
సాలిసిలిక్ యాసిడ్, సల్ఫర్, హైలీరోనిక్ యాసిడ్ పదార్థాలు గల మేకప్ ఎంపిక చేసుకొని మీరు సమర్థవంతంగా మొటిమలను దాచేయొచ్చు. ఈ కన్సీలర్ మేకప్ ప్రొడక్ట్స్‌పై నాన్-కామెడోజెనిక్ (Noncomedogenic), హైపోఆలెర్జెనిక్ (Hypoallergenic) అనే లేబుల్స్ కచ్చితంగా ఉంటేనే వాటిని వాడండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మొటిమలకు ఫేస్ మేకప్
మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్లయితే సల్ఫర్ ఉన్న ఫేస్ మాస్క్ వాడొచ్చు. మీ స్కిన్‌టోన్ ఆధారంగా మీరు హైడ్రేటింగ్, సూథింగ్, డీటాక్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్ వంటి ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవచ్చు. టీట్రీ ఆయిల్ వంటి వాటితో కూడా మీరు మొటిమలను వదిలించుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)