అయితే, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం చాలా మంది మహిళలు తమ ఆరోగ్య సమస్యలపై బహిరంగంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.పోషక ఆహారం, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్ ప్రతి ఒక్కరికీ కీలక మార్గం. ఇవి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి.(5 fruits that are the strongest for the heart of women)
మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే పండ్లు..
వాల్నట్లను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. మిల్క్ షేక్స్, కేక్స్, సలాడ్ బౌల్స్ వంటి రూపంలో తీసుకోవచ్చు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రచురించిన అధ్యయనం ప్రకారం వాట్నట్స్లో ఒమేగా –3 కొవ్వు యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ అనేక హృదయ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
బ్లూ బెర్రీస్..
బ్లూ బెర్రీస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. కణజాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం 150 గ్రాముల బ్లూబెర్రీలు గుండె సంబంధిత వ్యాధులను 15 శాతం వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఆహారంలో మార్పులతోపాటు లైఫ్స్టైల్లో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే గుండెను రక్షించవచ్చు.
సిట్రస్ ఫ్రూట్స్..
విటమిన్ సీ నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి పండ్ల ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సీ సమృద్ధిగా ఉన్న పండ్లలో గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.(5 fruits that are the strongest for the heart of women)