యాపిల్ సిడార్ వెనిగర్(ACV)..
యాపిల్ సిడార్ వెనిగర్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మిమ్మల్ని మేల్కొని ఉంచడమే కాకుండా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. పులియబెట్టిన యాపిల్స్ తో ఈ డ్రింక్‌ను తయారు చేస్తారు. చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఎసిటిక్ యాసిడ్ సమ్మెళనాన్ని కలిగి ఉంటుంది. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ ఏసీవీని కలపండి. అనంతరం నెమ్మదిగా సిప్ చేయండి. తీపి కావాలనుకుంటే అర టీస్పూన్ తేనెను కూడా కలపవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
కాబట్టి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. దీన్ని హల్దీ వాలా దూద్ అని కూడా పిలుస్తారు. ఈ పానీయాన్ని రాత్రిపూట తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే జీలకర్ర శరీర డిటాక్సిఫికేషన్‌లో సహాయపడుతుంది. పాలలో దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, నల్ల మిరియాల పొడిని కూడా జోడించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
మచ్చా టీ..
ఆకుపచ్చ రంగులో ఉండే ఈ మచ్చా టీని 'జపాన్‌లో దాచిన గొప్ప రహస్యం'గా చెబుతారు. ఇందులో కెఫిన్ ఉంటుంది కానీ కాఫీ మాత్రం కాదు. మచ్చా పౌడర్ అనేది పచ్చ రంగును కలిగి ఉంటుంది. ఇది ఒక వేరు మొక్క. వేడి నీటిలో 1-2 టీస్పూన్ల మచ్చా పొడిని కలిపి బాగా గిలక్కొట్టి ఈ టీని తయారు చేస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)