అధిక బరువు (heavy weight). మనిషికి మన: శాంతిని దూరం చేస్తుంది. వేళకు తినకపోవడం, సమయానికి నిద్ర పోక పోవడం తదితర కారణాలు బరువు పెరగడానికి (weight gain) కారణాలవుతాయి. అయితే ఈ అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. అందుకే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జిమ్‌లకు వెళ్లి గంటల తరబడి కుస్తీలు పడితే తప్ప కొవ్వు కరగట్లేదు. బాధాకరం ఏంటంటే... కొంతమంది జిమ్‌కి వెళ్లినా బరువు తగ్గట్లేదు. కారణం వాళ్లు తెగ తినేస్తున్నారనుకుంటే పొరపాటే. కారణం అది కాదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒత్తిడి, టెన్షన్లు ఎక్కువైతే... మన శరీరంలో కార్టిసాల్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది మన బాడీలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ రింగ్ లాంటిది వస్తుంటుంది కొంత మందికి. దానికి కారణం ఈ కార్టిసాలే. దీని అంతు చూస్తే తప్ప కొవ్వు కరగదు. అలా జరగాలంటే పాజిటివ్ థింకింగ్ పెరగాలి. ఈ కార్టిసాల్ వల్ల బీపీ కూడా వస్తుంది జాగ్రత్త.
పరిశోధకులు చాలా క్లారిటీగా చెబుతున్నది ఒకటే. జిమ్‌లలో ఎన్ని కుస్తీలు పట్టినా, శారీరకంగా ఎంత శ్రమించినా... బరువు తగ్గాలంటే... ఈ శ్రమతోపాటూ... పాజిటివ్ ఫీలింగ్స్ కూడా పెరగాల్సిందే అంటున్నారు. బాడీని కంట్రోల్ చేసే బ్రెయిన్లో పాజిటివ్ ఫీలింగ్స్ ఉంటే... ఆటోమేటిక్‌గా బరువు తగ్గడం మొదలవుతుందని బలంగా చెబుతున్నారు.