Diwali 2021: దీపావళి పండుగ కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. పండుగ రోజున వినాయకుడు, లక్ష్మిదేవిని పూజిస్తారు. లక్ష్మిదేవి సంపద, వైభవానికి మూలం. లక్ష్మిదేవి నివసించే ఇంట్లో సంపద, ఆనందానికి లోటు ఉండదని ప్రజలు విశ్వసిస్తారు. దీపావళి రోజు లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ లక్ష్మిదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అంతేకాదు ఆమె రాక కోసం ఆరాధిస్తారు. సాయంత్రం బాణాసంచాతో సందడి చేస్తారు.
దీపావళి రోజు అమ్మవారికి స్వాగతం పలికేందుకు ఉదయం నుంచే సన్నాహాలు ప్రారంభిస్తారు. ప్రజలు తమ ఇంటిని పువ్వులు, దీపాలతో అలంకరిస్తారు. అంతే కాకుండా ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు. ఈ విధంగా అమావాస్య రాత్రి కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది. దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండి.. మనకు అదృష్టం కలిసి రావాలి అంటే.. పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.
దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి. అలా చేస్తే సంతోషంగా లక్ష్మీ దేవీ ఇంట్లో అడుడు పెడుతుంది అన్నది చాలామంది నమ్మకం.. అందుకే దీపావళి రోజు ముందుగా ఇంటి ద్వారం ముందే దీపం వెలిగిస్తారు..
దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీ ధాన్యాలు మొదలైనవి స్టోర్ హౌస్లో ఉంచుతారు. కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు. అయితే చాలామంది ఇది మరిచిపోతుంటారు.. స్టోర్ రూంలో ఎందుకు అనుకుంటారు.. కానీ సంతోషంగా లక్ష్మీ దేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే.. కచ్చితంగా స్టోర్ హౌస్ లో దీపం వెలిగించాలి..
ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు. అందుకోసం దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. ఈ రోజుల్లో డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తోంది. డబ్బు ఉంటే చాలు సంతోషంతో సహా అన్ని కలిసి వస్తాయి. అందుకే దీపాన్ని డబ్బును ఉంచే ప్రదేశంలో తప్పక దీపం వెలిగించాలి.
వాహనాన్ని కూడా మనం ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది. అందుకే దీపావళి రోజు తప్పకుండా మన వాహనాల దగ్గర దీపం వెలిగిస్తే మంచే జరుగుతుంది. అయితే కాస్త దూరంగా పెడితే మంచింది. లేదంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకునే అవకాశం ఉంది..
నిత్యం ప్రతి వ్యక్తికి నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. తినకుండా అయినా కొన్ని రోజులు ఉండొచ్చేమో.. నీరు తాగకుండా కొన్ని గంటలు కూడా ఉండడం కష్టమే.. అందుకే కుళాయి, బావి లేదా మరేదైనా నీటి వనరు ఉన్నచోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి. అలా చేస్తే కచ్చితంగా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
సాధరణంగా పండుగ రోజు దీపావళి వెళ్లాలి అని అందరికీ అనిపించవచ్చు.. అయితే ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజగదిలో పడితే మంచిది. దీంతో లక్ష్మిదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. సాధారణంగా నిత్యం దేవుడి గదిలో దీపం పెడతాం.. అయితే దీపావళి రోజు కచ్చితంగా దేవుడి గదిని దీపాలతో అలంకరించాలి.
కేవలం ఇంటిలోని.. ఇంటి ఆవరణలోనే కాదు.. ముఖ్యంగా రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది. అందుకే దీపావాళి రోజు తప్పకుండా దేవుడిని దర్శించుకోవడం.. దగ్గర్లో రాగి చెట్టు ఉంటే దీపం వెలిగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.