HAPPY DHANTERAS 2020 KNOW WHY WE CELEBRATE DHANTERAS AND INTERESTING STORY BEHIND THIS FESTIVAL SS
Dhanteras 2020: ధన్తేరస్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఆసక్తికర కథ ఇదే
Happy Dhanteras and Diwali 2020 | ధనతేరాస్... ఈ పండుగనే తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశిగా పిలుస్తారు. అసలు ధనతేరాస్ లేదా ధనత్రయోదశి ఎందుకు జరుపుకొంటారంటే దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. భారతదేశంలో హిందువులు జరిపే ప్రతీ పండుగ వెనుక ఇలాంటి ఆసక్తికరమైన కథలు ఉంటాయి. మరి దీపావళి ముందు వచ్చే ధన్తేరస్ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకోండి.
1. ధన్తేరస్ పండుగ వెనుక ఆసక్తికర కథ ఉంది. (Image: Raj/News18 Creative)
2/ 12
2. చాలాకాలం క్రితం ఓ రాజ్యానికి హిమ అనే రాజు ఉండేవాడు. అతనికి ఓ కొడుకు ఉండేవాడు. (Image: Raj/News18 Creative)
3/ 12
3. ఆ యువరాజు 16వ పుట్టినరోజునాడు పాముకాటుతో చనిపోతాడని జాతకంలో తేలడంతో అందరూ భయపడ్డారు. (Image: Raj/News18 Creative)
4/ 12
4. జాతకాన్ని పట్టించుకోకుండా ఆ యువరాజు పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే తన జాతకంలో ఇలా పాముకాటుతో చనిపోతానని ఉన్నట్టు నిజం చెప్పి మరీ ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. (Image: Raj/News18 Creative)
5/ 12
5. భర్తకు ప్రాణగండాన్ని తప్పించాలని ఆ భార్య బాగా ఆలోచించింది. 16వ పుట్టినరోజు దగ్గరపడగానే ఓ పథకం రూపొందించింది. భర్త నిద్రపోతే పాముకాటుకు గురవుతాడన్న భయంతో అతడిని నిద్రపోనివ్వలేదు. రాత్రంతా మెళకువగానే ఉంచింది. (Image: Raj/News18 Creative)
6/ 12
6. భర్త పడకగది బయట బంగారం, వెండి నాణేలు, నగలను కుప్పలా పోసింది. జిగేల్మనిపించే, కళ్లుమిరుమిట్లుగొలిపే దీపాలతో ఆ ప్రాంతమంతా అలంకరించింది. (Image: Raj/News18 Creative)
7/ 12
7. అయితే తన భర్త నిద్రపోతాడేమోనని ఆమె ఆందోళన చెందింది. అతడిని మెళకువగా ఉండేందుకు రాత్రంతా పాటలు పాడుతూ ఉంది. (Image: Raj/News18 Creative)
8/ 12
8. యువరాజు 16వ పుట్టినరోజునాడు పాముకాటుతో చంపేయాలని జాతకంలో ఉండటంతో యమరాజు అక్కడికి వచ్చాడు. పాము రూపంలోకి మారిపోయాడు. (Image: Raj/News18 Creative)
9/ 12
9. యువరాజు పడకగది బయట దీపాల వెలుగులు, బంగారు నగల మెరుపులతో పాము రూపంలో ఉన్న యముడికి కళ్లు కనిపించలేదు. దీంతో నగల కుప్పపై కదలకుండా కూర్చున్నాడు. పడకగదిలోంచి యువరాజు భార్య పాటలు పాడుతుంటే వింటూ అలాగే కూర్చున్నాడు యముడు. (Image: Raj/News18 Creative)
10/ 12
10. అలా రాత్రంతా గడిచిపోయింది. జాతకం ప్రకారం రాత్రే యువరాజును కాటెయ్యాలి కానీ... రోజు దాటిపోయింది. దీంతో పాము రూపంలో ఉన్న యమరాజుకు అక్కడ్నుంచి వెళ్లిపోకతప్పలేదు. (Image: Raj/News18 Creative)
11/ 12
11. అలా తన భర్తను కాపాడుకుంది ఆ భార్య. అప్పట్నుంచీ వారిద్దరూ సంతోషంగా జీవితం గడిపారు. దానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం ధన్తేరస్ జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున బంగారు నగలు కొంటే శుభప్రదం అన్న విశ్వాసం ఏర్పడింది. (Image: Raj/News18 Creative)
12/ 12
12. అంతేకాదు... ధన్తేరస్ రోజునే 'యమదీపదాన్' నిర్వహిస్తారు. అకాల మరణం నుంచి తప్పించాలని ప్రార్థిస్తూ యమరాజును పూజిస్తారు. (Image: Raj/News18 Creative)