సాధారణంగా హోలీ రోజు చర్మ సంరక్షణకు చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జుట్టుపై మాత్రం పెద్దగా దృష్టిపెట్టరు. రంగుల ప్రభావం చర్మంపై మాత్రమే కాదు.. వెంట్రుకలపై కూడా ఉంటుంది. రసాయన రంగులు వాడితే.. జుట్టు పొడిబారి నిర్జీవంగా మారింది. ఐతే హోలీ రోజు కొన్ని రకాల నూనెలు తలపై రాసుకుంటే.. రంగుల ప్రభావం మీ జట్టుపై ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
హోలీలో రంగులు ఆడే ముందు తలకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు రంగు అంటుకోదు. కడిగేటప్పుడు సులభంగా బయటకు వస్తుంది. అంతకాదు, కొబ్బరి నూనెలో విటమిన్-ఇ, కొవ్వు ఆమ్లాలు , ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. అందుకే హోలీ ఆడే ముందు జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
జుట్టు ఆరోగ్యానికి ఆలివ్ నూనె చాలా మంచిది. అందులో నిమ్మరసం కలిపితే దాని ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి. హోలీ ఆడే ముందు నిమ్మకాయ, ఆలివ్ నూనెను కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్‌ను జట్టుకు అప్లై చేయండి. ఇది రంగుల నుంచి జుట్టును రక్షించడమే కాకుండా.. అద్భుతమైన పోషణను అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)