Gucchi mushrooms : ఫొటోని చూసి ఇవి పుట్టగొడుగులు అని మీకు అర్థమయ్యే ఉంటుంది. మీ అంచనా కరెక్ట్. ఇవి పుట్టగొడుగులే కానీ.. వీటికి ఉన్న ప్రత్యేకతలు అబ్బో.. చాలా. అరుదైనవి, రుచికరమైనవి కావడం వల్ల వీటి ధర చాలా ఎక్కువ. ఇండియాలో ఇవి కేజీ రూ.10,000 నుంచి రూ.30,000 దాకా పలుకుతున్నాయి. వీటిని ప్యాక్ చేసి అమ్మే కంపెనీలకు ఉన్న బ్రాండ్‌ని బట్టీ వీటి ధర ఆధారపడి ఉంటోంది. మరీ ఇంత రేటు ఎందుకు అనిపిస్తోందా? తెలుసుకుందాం. (image credit - twitter - @sidhshuk)
వీటిని మోరెల్ (Morel Mushroom) పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేనా.. పొటాషియం, కాపర్, సెలెనియం, విటమిన్ బీ2 (రైబోఫ్లావిన్) కూడా ఉంటాయి. ఇంకా యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువే. (image credit - twitter - @O_arra_)
ఇంతకీ వీటి రుచి ఎలా ఉంటుందో చెప్పలేదు కదూ... ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. మాంసం ఫ్లేవర్‌తో ఉంటాయి. తినేటప్పుడు బాగా నమిలి తినాలి అని అనిపించేలా ఉంటాయి. శాఖాహారులు, వేగన్లు... మాంసం బదులు.. వీటిని తింటారు. గుచ్చీ పులావ్, గుచ్చీ కబాబ్స్, రోస్టెడ్ గుచ్చీ, గుచ్చీ కర్రీస్ ఇలా చాలా రకాలుగా వండుకుంటున్నారు. (image credit - twitter - @O_arra_)
ఉత్తరాఖండ్ లోని కోనిఫెర్ అడవులు, కంగ్రా లోయ, మనాలీలో పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఇవి సహజంగా పెరుగుతాయి. స్థానికులు వాటిని సేకరించి.. అమెరికా, యూరప్ సహా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. (image credit - twitter - aiburza)" width="740" height="674" /> ఇవి మన ఇండియాలో... ఉత్తరాఖండ్ లోని కోనిఫెర్ అడవులు, కంగ్రా లోయ, మనాలీలో పెరుగుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో ఇవి సహజంగా పెరుగుతాయి. స్థానికులు వాటిని సేకరించి.. అమెరికా, యూరప్ సహా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. (image credit - twitter - aiburza)