మనలో చాలా మందికి చాలామందికి గ్రీన్ టీ గురించి తెలుసు. గ్రీన్ కాఫీ గురించి తెలియదు. గ్రీన్ కాఫీ అనేది ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాఫీలో ఉండే కెఫిన్ మన ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఇప్పటి వరకు మనం విన్నాం. అయితే గ్రీన్ కాఫీలో కెఫిన్ ఉండదని మీకు తెలుసా? ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు.
హెల్త్‌లైన్ ప్రకారం, గ్రీన్ కాఫీ వాస్తవానికి కాల్చని ముడి కాఫీ గింజల నుండి తయారు చేయబడింది. ఇది అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గ్రీన్ కాఫీని బ్రోకలీ కాఫీగా కూడా పిలుస్తారు. ఎందుకంటే గ్రీన్ కాఫీ తయారీలో బ్రోకలీ ఉపయోగిస్తారు. బ్రోకలీ పౌడర్ సహాయంతోనే గ్రీన్ కాఫీ తయారవుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా శరీరం మెటబోలిజం మెరుగుపడుతుంది.