Green Chillies : పచ్చి మిరపకాయలు రోజుకు ఇన్ని తింటేనే బోలెడు లాభాలు.. లేదంటే ఫసక్కే..!
Green Chillies : పచ్చి మిరపకాయలు రోజుకు ఇన్ని తింటేనే బోలెడు లాభాలు.. లేదంటే ఫసక్కే..!
Green Chillies : మనలో చాలా మంది మిరపకాయలతో తమ ఆహారానికి రుచిని జోడించాలని కోరుకుంటారు. కొంతమంది పచ్చి మిరపకాయలను చాలా ఇష్టంగా తింటారు. అయితే పచ్చి మిరపకాయల్ని తగిన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. లేదంటే ప్రమాదమే.
పచ్చి కారం కొందరికి కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే.. పచ్చి మిరపకాయలను చాలా మంది ఆహారంలో ఉపయోగిస్తారు. కానీ పచ్చిమిర్చిలో డైటరీ ఫైబర్, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ఫోలేట్, ఐరన్, మాంగనీస్ మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయని చాలా మందికి తెలియదు.
2/ 8
ఇందులో విటమిన్ ఎ, సి, కె, బి6, పొటాషియం, కాపర్ మరియు మెగ్నీషియం ఉన్నాయి. దానిలోని అన్ని మూలకాలు మన శరీరానికి అవసరం. పచ్చిమిర్చి తినడం వల్ల కలిగే ప్రయోజనాలను వింటే మీరు ఆశ్చర్యపోతారు.
3/ 8
క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతుంది : పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో పేరుకుపోయిన అన్ని హానికరమైన టాక్సిన్లను తొలగిస్తాయి. ఫలితంగా, సహజంగా సంభవించే క్యాన్సర్ కణాల ప్రమాదం తగ్గుతుంది.
4/ 8
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది : పచ్చిమిర్చి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5/ 8
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో వైరస్, బ్యాక్టీరియాలు శరీరానికి హాని కలిగించవు.
6/ 8
మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది : పచ్చి మిరపకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. కాబట్టి సహజంగా మధుమేహం వంటి వ్యాధులు దరిచేరడానికి అవకాశం ఉండదు.
7/ 8
అయితే పచ్చి మిరపకాయలను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే శరీరంలో ఎసిడిటీ, స్టామక్ ఇరిటేషన్, పొట్ట ఉబ్బరం, టాక్సిన్స్ పెరగవచ్చు. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ పచ్చి మిరపకాయలు తినడం వల్ల డిమెన్షియా లాంటి పరిస్థితులు తలెత్తుతాయి.
8/ 8
పచ్చి మిరపకాయలు ప్రయోజనకరమైనవి అయినప్పటికీ, అవి అన్ని రోగాలకు నివారణ కాదు. కాబట్టి ఆహారంలో పరిమితంగా ఉండాలి. రోజుకు కేవలం రెండు పచ్చి మిరపకాయలు తినడం వల్ల మీకు మేలు చేకూరుతుంది.