Decoction: డికాక్షన్ కూడా జలుబు, దగ్గు అంతుచూస్తుంది. ఓ గ్లాస్ వాటర్ వేడి చెయ్యండి. నీరు ఉడుకుతున్నప్పుడు ఓ రెండు లవంగాలు, నాలుగు మిరియాలు, ఓ యాలిక, ఓ చిన్న అల్లం ముక్క, కొద్దిగా బెల్లం వెయ్యండి. మీడియం ప్లేమ్‌లో ఉడకనివ్వండి. మధ్యలో అటూ ఇటూ కదుపుతూ ఉండండి. నీరు సగానికి తగ్గగానే తులసి ఆకులు నాలుగు వెయ్యండి. కొద్దిగా టీపొడి వెయ్యండి. మరో నిమిషం ఉడికితే చాలు... ఫిల్టర్ చేసి... ఆ డికాక్షన్ తాగారంటే... గొంతులో, ముక్కులో ఉన్న వైరస్‌లన్నీ గిలగిలా కొట్టుకుంటూ చస్తాయి. ఇక మందులతో పనేముంది.