మొటిమల సమస్య ఉన్నవారు అల్లం పేస్టును ముఖానికి రాసుకోవాలి. అల్లం రసంలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ వేసి, అందులోనే ఒక రెండు టీ స్పూన్ల తేనెను కలిపి ముఖానికి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరు త్వరలోనే ఫలితం పొందవచ్చు.