అనేక మంది భోజన ప్రియులు నెయ్యి అంటే పడి చస్తారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోనిదే ముద్ద ముట్టని వారు కూడా అనేకం. అయితే నెయ్యి రుచి మరియు వాసనను పెంచడమే కాకుండా.. మరెన్నో ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే భారతదేశంలో నెయ్యి తినే పద్ధతి యుగయుగాలుగా కొనసాగుతోంది. నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడ్డాయి.(ప్రతీకాత్మక చిత్రం)
నెయ్యి చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగా ఉంచుతుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా నెయ్యి కాపాడుతుంది. నెయ్యి శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యి చర్మం మరియు జుట్టుకు ప్రకాశాన్ని తెస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)