Repel Spiders: సాలీళ్లు మనకు ఏ హానీ చెయ్యవు. అలాగని వాటిని మన ఇళ్లలోకి రానిస్తే... ఇల్లంతా పురాతన బంగ్లాలా మార్చేస్తాయి. ఎక్కడ వీలైతే అక్కడ గూడు కట్టి... ఇంటీరియర్‌ను చెడగొడతాయి. అందువల్ల సాలీళ్లను బయటే ఉంచుకోవాలి. వాటిని తరిమేందుకు మనం ఏ పెస్టిసైడ్సో వాడకూడదు. అలా చేస్తే... వాటికి హాని చేసినట్లవుతుంది. అలాగే... ఆ పెస్టిసైడ్స్ వాసనలు, స్ప్రేలు వంటివి మనకు వికారం కలిగించవచ్చు, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవచ్చు. అందువల్ల... కొన్ని ప్రత్యేక పద్దతులతో చాలా తేలిగ్గా... వాటిని బయటకు పంపేయవచ్చు. ఇంట్లోంచీ బయటకు పోయి... ఏ చెట్టు మీదో అవి గూళ్లు కట్టుకోగలవు.
పుదీనాను చూస్తే చాలు సాలీళ్లు... వామ్మో అంటాయి. దాని వాసన అంటే సాలీళ్లకు టెన్షన్. మీకు తెలుసా... సాలీళ్ల కాళ్లకు రుచి నాళాలు ఉంటాయి. కాళ్లే రుచి చూడగలవు. మీరు ఇంట్లో పుదీనా చాయ్ తయారుచేసుకున్నారంటే చాలు... వామ్మో... అయిపోయాం... అనుకుంటూ సాలీళ్లన్నీ ఎటు డోర్ ఓపెన్ చేసి ఉందా బయటకు పారిపోవాలని చూస్తాయి.
ఇన్ని చేసినా సాలీళ్లు ఉన్నాయంటే... చివరిగా ఓ నిమ్మకాయను కోసి... అందులో రసాన్ని నీటిలో పోసి... ఆ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి... ఇంట్లో, తలుపులు, కిటికీలపై, అన్ని మూలలపై స్ప్రే చెయ్యండి... అంతే... ఇక సాలీళ్ల సమస్యే ఉండదు. ఈ ప్రయత్నాల వల్ల సాలీళ్లు చనిపోవు. పారిపోతాయంతే. తద్వారా వాటిని చంపి... పర్యావరణానికి మనం హాని చేసిన వాళ్లం అవ్వం. అదే సమయంలో మన సమస్య కూడా తొలగుతుంది.