FULL DEMAND FOR PULASA IN YANAM ONE FISH PRICE TO MORE THAN 25 THOUSAND NGS
Pulasa: రుచే కాదు డిమాండ్ అ‘ధర’హో.. పంట పండిస్తున్న పులస.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాకే..
Pulasa Fish Cost: మత్స్యకారులకు పులస లాభాల పంట పండిస్తోంది. రుచి లోనే కాదు ధరలోనూ అదుర్స్ అనిపిస్తోంది. ఎప్పుడూ లేనంత రికార్డు ధరతో సామాన్యులకు షాక్ ఇస్తోంది.
Pulasa Fish Cost:ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఈ సారి పులస చాలా తక్కువగానే దొరికింది. ఉభయ గోదావరి జిల్లాల్లో పులస ఎప్పుడు పడుతుందా అని మత్స్యకారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీంతో డిమాండ్ ఊహించని స్థాయిలో పెరిగింది. పులస దొరికిన జాలర్ల పంట పడుతోంది.
2/ 8
గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఫేమస్ అయింది పులస.. గోదావరిలో పులస దొరికితే చాలు ఆరోజు వారికి పండగే అని చెప్పాలి.
3/ 8
వరదనీటికి ఎదురీదడం వల్ల బురదలో సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి వస్తాయి. ఈ క్రమంలో మస్త్యకారుల వలకు చిక్కుతాయి. తాజాగా గోదావరిలో పులస ఎవరూ ఊహించని విధంగా భారీ ధర పలికింది.
4/ 8
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గౌతమి తీరంలో లభించిన పులసల ధర అధరహో అనిపించింది.
5/ 8
సుమారు రెండు కిలోలకు పైగా బరువున్న రెండు పులసలు ఒక్కొక్కటీ 20 వేల రూపాయలకు పైగా ధర పలికింది.
6/ 8
ఇంత ధర పలకడం యానాం చరిత్రలోనే ఇదే తొలిసారి అంటున్నారు అక్కడి మత్స్యకారులు.
7/ 8
గురువారం మార్కెట్కు తెచ్చిన ఓ పులసను నాగలక్ష్మి అనే మహిళ 23 వేలకు, మరో పులసను 25 వేలకు భాగ్యలక్ష్మి అనే మహిళ వేలంలో దక్కించుకున్నారు.
8/ 8
ఆ వెంటనే ఆమె.. వాటిని మరికొంత లాభంతో అక్కడికక్కడే అమ్మడం విశేషం. గతేడాది పులస ధర 20 వేల రూపాయలు పలికితేనే అమ్మో అనుకున్నారు. ఇప్పుడు ఆ ధర 25 వేలు దాటడం విశేషం.