ఆస్తమా ఉన్నవారు రన్నింగ్ చేయాలనుకుంటే.. తక్కువ దూరం ఉండే స్ప్రింట్స్ వంటి రన్నింగ్ ఎక్సర్సైజ్ ఎంచుకోవచ్చు. అయితే ట్రాక్ అండ్ ఫీల్ట్ ప్రాక్టీస్ కొన్నిసార్లు తీవ్ర అలసటకు గురిచేయవచ్చు. తీవ్రత ఎక్కువగా ఉండే, అనియంత్రిత ఆస్తమా ఉన్నవారు రన్నింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, లాంగ్ జాగింగ్ వంటివి చేయకపోవడం మంచిది.
ఇది ఆస్తమా లక్షణాలను ప్రేరేపించని మంచి ఆల్టర్నేటివ్ ఫిజికల్ యాక్టివిటీగా చెప్పుకోవచ్చు. అయితే మరీ ఎక్కువ ఇబ్బందిపడకుండా, సింపుల్ ట్రెక్కింగ్ మార్గాలను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ మీకు ఏవైనా అలర్జీలు ఉంటే, ట్రెక్కింగ్‌కు వెళ్లే ముందు ఆ ప్రాంతంలో పుప్పొడి స్థాయిని (pollen level) చెక్ చేయండి. ఈ లెవల్ తక్కువగా ఉంటేనే ట్రెక్కింగ్ చేయండి.
రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇబ్బంది పడే ఉబ్బసం బాధితులు బైక్ రైడింగ్‌ను ఎంచుకోవచ్చు. ఎవరికైనా EIB (Exercise-induced bronchoconstriction) ఉంటే.. శ్వాస తీసుకునే మార్గం చిన్నదిగా ఉంటుంది. ఇలాంటి వారు మోడరేట్ బైక్ రైడ్‌కు వెళ్లవచ్చు. ఇండోర్ సైక్లింగ్ కూడా ఆస్తమా పేషెంట్స్‌కు ఒక మంచి ఎక్సర్సైజ్ ఆప్షన్.