నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ లేదా జామూన్ అంటారు. వేసవి కాలం ముగుస్తున్న సమయంలో... ఈ పండ్లు మార్కెట్లో లభిస్తాయి. జావా ప్లమ్ అని కూడా పిలిచే ఈ పండ్లలో ఔషధ గుణాలు ఎక్కువే. చాలా రకాల వ్యాధుల్ని కూడా ఇవి తగ్గిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తాయి.
షుగర్ షేషంట్లకు మంచిది : డయాబెటిక్ పేషెంట్లు వీటిని తప్పకుండా తినాలి. ఇవి రక్తంలో చక్కెరను స్తాయిని పెంచదు. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మధుమేహ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకుంటే మంచిది. అలాగే, నేరడు విత్తనాలు ఎండబెట్టి.. పొడి చేసుకుని తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయ్.