ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య సెక్స్ కోరికలు తగ్గడం. అందుకే చాలా మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ తమ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ డాక్టర్ల చుట్టూ తిరగడం కంటే సహజసిద్ధమైన పదార్థాలతోనే లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు లైంగిక సమస్యలకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు నిపుణులు. అఫ్రొడిసియాక్ ఫుడ్స్‌గా పేర్కొనే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల లైంగిక ఆరోగ్యం, సెక్స్ సామర్థ్యం మెరుగుపడుతుందట.
ఇక, అఫ్రొడిసియాక్ ఫుడ్ అయిన అల్లం.. సెక్సువల్ కోరికలను పెంచుతుందని ఎవరూ ఊహించరు. కానీ నాలుగు వేల సంవత్సరాలకు పూర్వమే భారత్‌లో, ఆసియాలో శ్రుంగవేర అనే పేరుతో అల్లాన్ని సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారట. శ్రుంగవేర అనే పదానికి జింక కొమ్ముల్లాంటిది అని అర్థం. ఇది సెక్సువల్ ఆరోగ్యాన్ని పెంచేందుకు అత్యంత ముఖ్యమైన ఆహారాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.