* మెంతులు : జుట్టు రాలడం, చుండ్రు, తలలో దురద, కురులు చిట్లిపోవటం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలన్నీటికి మెంతులు చెక్ పెడతాయి. అయితే వీటిని హెయిర్ ఆయిల్‌కి యాడ్ చేసుకుని తలకి రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మెంతులను గోరువెచ్చని కొబ్బరి నూనెలో కలిపి, దానిని చల్లారనిచ్చి, ఆపై మీ తలకు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచితే జుట్టు రాలే సమస్య పోతుంది.
మెంతులను కడి (Kadhi) వంటకంలో కూడా చేర్చవచ్చు. అలానే రాత్రి వేళ ఖిచ్డీతో తినవచ్చు. తడ్కాలో గుమ్మడికాయ వంటి కూరగాయల కోసం లేదా మీ రైతా రుచి కోసం దీన్ని వాడవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపరచడంలో సహాయపడే హార్మోన్ల సమస్య వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుంది. అయితే మెంతులతో ఈ సమస్యను కూడా పోగొట్టవచ్చు.
* అలివ్ సీడ్స్ : గార్డెన్ క్రెస్ విత్తనాలు లేదా హలీమ్ గింజలు అని పిలిచే అలివ్ విత్తనాలలో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, ఇ, ఎ తో పాటు ఫైబర్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని నానబెట్టి, రాత్రి పాలతో తీసుకుంటే జుట్టుకు తగిన పోషణ అందుతుంది. మెరుగైన ఫలితాల కోసం ఈ ఐరన్ రిచ్ విత్తనాలను కొబ్బరి, నెయ్యితో లడ్డూలుగా చుట్టుకొని తినవచ్చు. కీమో ట్రీట్మెంట్ వల్ల జుట్టు రాలే సమస్యలు వస్తాయి. అయితే తరహా సమస్యను కూడా ఈ గింజలు తగ్గించగలవు.
వీటితో పాటు నెయ్యి కూడా ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులోని కొవ్వులు మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించే జుట్టు రాలే సమస్యలకు చెక్ పెడతాయి. రోగనిరోధకశక్తిని పెంచే పసుపు కూడా డైట్లో యాడ్ చేసుకోవాలి. మినరల్స్, ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కోసం పెరుగు తరచూ తింటే మంచిది. గుమ్మడి గింజలు తినడం ద్వారా కూడా జుట్టు రాలే సమస్యను వదిలించుకోవచ్చు.