గుండెకు ప్రమాదం: మన బాడీలో చాలా ముఖ్యమైనది గుండె. ఈ చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్... చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగా సాగదు. ఏదో ఒక రోజు గుండె నొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత డాక్టర్లు ఇదే విషయం చెప్పి... చిప్స్ తినొద్దని సూచిస్తారు. మరో అధ్యయనం ప్రకారం రక్తంలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నవారికి అల్జీమర్స్ లేదా మతిమరపు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం 75 శాతం ఎక్కువ అని తేలింది.
రోగ నిరోధక శక్తి (Immunity) ఔట్: కరోనా వచ్చాక మనమంతా కష్టపడి ఇమ్యూనిటీని పెంచుకుంటున్నాం. అలాంటి మనం ఈ ఫ్రైలు, చిప్సూ వంటివి తరచూ తింటే... ఇలా పెరిగిన ఇమ్యూనిటీ, అలా పోతుంది. బాడీలో కొవ్వు చెడు బ్యాక్టీరియాను పెంచుతుంది. అది మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఫలితంగా మనకు రకరకాల రోగాలు రావడం మొదలవుతుంది.
ఇదంతా చదివాక... వామ్మో అనిపించడం సహజం. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు గానీ... తరచూ తింటే ప్రమాదమే. దానికి తోడు ఇలాంటివాటికి షాపులు, సూపర్ మార్కెట్లలో ఆఫర్లు ఎక్కువ ఉంటాయి. ఒకటికి ఒకటి ఫ్రీ అని ఇస్తుంటారు. అయినా సరే మనం వల్లో పడకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని... కంట్రోల్ చేసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.