ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు ఓట్మీల్, గుడ్లు, గ్రీక్ యోగర్ట్ వంటివి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక మధ్యాహ్న భోజనంగా అధిక ప్రోటీన్లుండే చికెన్, చేపలు, పన్నీర్ వంటివి తినాలట. అదేవిధంగా నైట్ డిన్నర్లోనూ వీటిని తీసుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, క్రీడాకారులు, అథ్లెట్లకు ప్రొటీన్ ఆహారం ఎంతో అవసరమని వెల్నెస్ నిపుణులు చెబుతున్నారు.
* నడక : ఎక్కువగా నడవడం అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండానే దీనిని సాధ్యం చేయొచ్చని చెబుతున్నారు. మార్కెట్‌కు వెళ్లే సమయంలో వాహనాలకు బదులు నడకకు ప్రాధాన్యం ఇవ్వడం, లేదా, కాస్త దూరంగా వాహనాన్ని పార్క్ చేసి లోపలి వరకు నడుచుకుంటూ వెళ్లడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఇలా రోజుకు మీరు ఎన్ని అడుగుల దూరం నడుస్తున్నారో కౌంట్ చేసుకొని... ఏ రోజుకారోజు టార్గెట్‌ని పూర్తి చేయాలని ప్రోత్సహిస్తున్నారు.
నడవడం వల్ల శారీరక దృఢత్వమే కాక, మానసిక ప్రశాంతత చేకూరే అవకాశం ఉంది. ఒత్తిడి, ఆందోళన దూరమై మనసు నిర్మలంగా మారుతుంది. ఇది మన రోజువారీ కార్యకలాపాలపై సానుకూల ప్రభావం చూపే ఆస్కారముంది. ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్‌ని అడాప్ట్ చేసుకోవడం వల్ల మెరుగైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అందువల్ల ఆల్కహాల్‌ని వీలైనంత మేరకు పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. ఆల్కహాల్ వల్ల బరువు ఉన్నట్టుండి పెరిగే ఆస్కారముందట. ముఖ్యంగా తాగి డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి హింసకు దారి తీసే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోవాలంటే తప్పకుండా ఆల్కహాల్ సేవించడాన్ని పరిమితం చేయాల్సిందేనని సూచిస్తున్నారు.