టిఫిన్లు తినాల్సి వచ్చినప్పుడు.. పరోటాతో సహా మైదా ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే, తృణధాన్యాలు ఖాళీ కడుపులో తీసుకోవడం మంచిది కాదు. తృణధాన్యాలలో అధిక స్థాయిలో చక్కెర నిల్వలను కలిగి ఉంటాయి. ఏదైనా తిన్న తర్వాత వాటిని తీసుకోవడం మంచిది. ఇది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట.
అల్పాహారం కోసం పండ్లరసాలు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. కానీ కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ లేదా ఇతర గ్యాస్ ఆల్కహాలిక్ పానీయాలలో ఆమ్లం కంటెంట్ ఎక్కవగా ఉంటుంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి అల్పాహారంతో కూరగాయలు, పండ్ల రసాలు తప్ప మార్కెట్లో దొరికే శీతలపానీయాలను వదిలేయడం మంచిది.