దాల్చిన చెక్క టీ : దాల్చిన చెక్కని మనం మసాలా దినుసుల్లో విరివిగా వాడతాం. దీనిని తాగడం వల్ల ఇందులోని ప్రత్యేక గుణాలు రక్తంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేస్తాయి. అదే విధంగా, స్కిన్ మెరిసేలా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్న దాల్చిన క్యాన్సర్ కారకాలకు కూడా వ్యతిరేకంగా పని చేస్తుంది. వీటితో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. Image from Pexels
నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే లేవగానే, ఒకటి, రెండు గ్లాసుల నీరు తాగండి. గోరువెచ్చగా ఉంటే మరింత మంచిది. జీర్ణ సమస్యలు, అనేక సమస్యలకు ఈ నీరు పరిష్కారం చూపిస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీరు తాగడం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది మంచి రెమిడీలా పనిచేస్తుంది. Image from Pexels