మామిడి చాలా రుచికరమైన పండు. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. ఇది రుచితో పాటు ఆరోగ్యంతో కూడుకున్నది. వేసవిలో, ప్రజలు ఈ పండును చాలా ఇష్టపడతారు. ప్రపంచంలో దాదాపు 1400 రకాల మామిడిపండ్లు ఉన్నాయి, కానీ మన దేశంలో పండే మామిడిలో ప్రధానంగా దాసరి, రసాలు, కేసర్, బంగినిపల్లి మొదలైనవి ఉన్నాయి.
వేసవిలో మామిడి పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చాలా ప్రయోజనకరమైన పండుగా పరిగణించబడుతుంది. ఈ సీజన్లో మామిడి పండ్లను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉన్నాయి. పొటాషియం, ప్రొటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు మామిడిలో ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇది సాధారణ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.