పొట్ట కరిగించి బరువు తగ్గాలని చాలామందికి ఉంటుంది. కానీ, దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిత్యం వ్యాయామాలు చేయాలి. ఆకలికి ఓర్చుకుంటూ డైట్ ఫాలో కావాలి. అయితే, కొన్ని హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంతో పాటు పొట్టను కరిగించొచ్చు అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. (ప్రతీకాత్మక చిత్రం -Image credit pixabay)
కొన్ని పద్ధతులు పాటిస్తే మనం ఎంచక్కా మనకు అలవాటైన అన్నం తింటూనే బరువు తగ్గొచ్చు. అదెలా అంటే….అన్నం తినండి, కానీ ఎక్కువ తినకండి. పోర్షన్ కంట్రోల్ అలవాటు చేసుకోవాలి. ఇది ఒక్క అన్నం విషయంలోనే కాదు మనం తినే అన్ని పదార్ధాలకూ వర్తిస్తుంది. మనం బరువు పెరగడానికి అతి ముఖ్య కారణం అతిగా తినడం. (ప్రతీకాత్మక చిత్రం -Image credit pixabay)