Food for Blood : మనం చాలా విషయాల్ని తేలిగ్గా తీసుకుంటాం. తరచూ నీరసంగా ఉన్నా.. ఏం కాదులే అనుకుంటాం. అందుకు కారణం మన శరీరంలో తగినంత రక్తం లేకపోవడం కావచ్చు. రక్తం తగ్గితే (రక్తహీనత - Anemia) ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా? డాక్టర్ని అడిగితే.. ఓ గంటసేపు చెబుతారు ఎదురయ్యే సమస్యల్ని. అంత డీప్ సబ్జెక్ట్ ఇది. అదంతా మనకెందుకు.. రక్తం పెరిగేలా చేసుకుంటే సరి.
Pomegranate : మనం పీల్చుకునే ఆక్సిజన్.. రక్తంలో కలిసి.. బాడీలోని అన్ని కణాలకూ ప్రతీ సెకండ్ వెళ్తుందని మీకు తెలుసు కదా. మరి ఆక్సిజన్, రక్తంలో కలవాలంటే ఐరన్ అవసరం. రక్తంలో సరిపడా ఐరన్ లేకపోతే.. లేని పోని రోగాలు వస్తాయి. అందుకే ఐరన్ కోసం దానిమ్మపండ్ల రసం తీసుకోవాలి. రక్తం బాగా పెరుగుతుంది కూడా. పేగుల్లో మంటను తగ్గిస్తుంది దానిమ్మరసం. గుండెకు కూడా దానిమ్మ మేలు చేస్తుంది.
Spinach : పాలకూర తెలుసుగా... చాలా రుచిగా ఉంటుంది. అన్ని కూరల్లో వేసుకోవచ్చు. పేపర్ కవర్లో చుట్టి.. ఫ్రిజ్లో పెడితే.. మూడు రోజులైనా పాడవ్వదు. తింటే ఆరోగ్యకరం. ఇందులో ఐరన్, విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి పాలకూర తినడం వల్ల శరీరంలో రక్తం పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. పాలకూర తినడం వల్ల కండరాలు, ఎముకలు బలపడతాయి.