ఐస్ క్రీమ్స్ : ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నా.. వేసవి కాలంలో ఐస్ క్రీమ్స్ కు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఐస్ క్రీమ్స్ లో ఫ్యాట్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని అరిగించేందుకు మన జీర్ణ వ్యవస్థ ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. వీటిని అరిగించే క్రమంలో బాడీని హీట్ చేయాల్సి ఉంటుంది. ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఉండే చల్లదనం.. అది అరిగేటప్పుడు ఉండదనే విషయాన్ని గుర్తించుకోవాలి. వేసవి కాలంలో ఐస్ క్రీమ్స్ కు దూరంగా ఉంటేనే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్రైడ్ ఫుడ్స్ : వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అంటే ఎవరికైనా ఇష్టమే. ఇక చిన్న పిల్లలు అయితే ఎగబడి తింటారు. అయితే ఎండకాలంలో వీటికి దూరంగా ఉంటేనే మంచిది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు జీర్ణం అయ్యేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. నూనె పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల మొహం మీద మొటిమలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎండకాలంలో మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వేసవిలో నూనె పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
మామిడి పళ్లు : వేసవి కాలంలో మనకు అందుబాటులో ఉండే ఫ్రూట్ మామిడి. వేసవి కాలంలో మామిడి పళ్ల కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు. అయితే వీటిని తగిన మోతాదులోనే తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డోస్ కు మించి తింటే వేడి చేసి విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా తలనొప్పి, కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)