Ayurvedic Tips: పెరుగు ఎలా పడితే అలా తినేయకూడదు.. ఇలానే తినమని ఆయుర్వేద నిపుణుల సలహా..
Ayurvedic Tips: పెరుగు ఎలా పడితే అలా తినేయకూడదు.. ఇలానే తినమని ఆయుర్వేద నిపుణుల సలహా..
Ayurvedic Tips: పెరుగులో మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్నప్పటికీ సాధారణ పెరుగును నేరుగా తినడం వల్ల మన రక్తం కలుషితమై చర్మ సమస్యలకు కూడా దారితీస్తుందట..
పెరుగులో మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్నప్పటికీ సాధారణ పెరుగును నేరుగా తినడం వల్ల మన రక్తం కలుషితమై చర్మ సమస్యలకు కూడా దారితీస్తుందట..
2/ 8
వేసవికాలం మొదలైంది. మెల్లిగా వాతావరణంలో వేడి స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం అవ్వగానే ఇంట్లో ఉన్నా కూడా చెమటలు పట్టేస్తున్నాయి. దీంతో చాలా మంది తమ శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఐస్ క్రీం, కూల్ డ్రింకులకు ఎగబడతారు.
3/ 8
కానీ, ఆరోగ్యకరమైన ఆప్షన్ మాత్రం పెరుగు.అందుకే వేసవికాలం పెరుగుకు డిమాండ్ బాగా పెరుగుతుంది. చాలామంది పెరుగులో చక్కెర లేదా బెల్లం వేసుకుని తీసుకుంటారు.
4/ 8
కానీ, ఆలిఘర్ ఆయుర్వేదిక వైద్య నిపుణుడు డాక్టర్ సరోజ్ గౌతమ్ పెరుగును నేరుగా తినకూడదని సలహా ఇస్తున్నారు. లేకపోతే అది మనల్ని చల్లబరచడం పక్కన పెడితే ఇతర ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయట.
5/ 8
అంతేకాదు, ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజూ పెరుగు తినకూడదట. పెరుగును పెసలు, తేనె, నెయ్యి, చక్కెర లేదా ఉసిరితో తింటే దాని ఆరోగ్య ప్రయోజనాలు పూర్తిగా మన శరీరానికి అందుతాయట.
6/ 8
ఉప్పు, చక్కెరతో కలిపి పెరుగును ప్రతిరోజూ తినకూడదు.ఎందుకంటే ఈ రెండు కలపి తీసుకోవడం మన శరీరంలో హీట్ జనరేట్ అవుతుందట.దీంతో చర్మ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అంతేకాదు తెల్లవెంట్రుకలు, ముఖంపై మచ్చలు, హెయిర్ ఫాల్ సమస్యలు కూడా మొదలవుతాయట.
7/ 8
చక్కెరతో మాత్రం కలిపి తీసుకునే పెరుగును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఏ సమస్యలు రావు. నిశ్చింతగా తినవచ్చట.ఆయుర్వేదంలో ప్రతిరోజూ చక్కెర కలిపిన లస్సీ తాగడం కూడా ఎంతో ఉపయోగకరం. దీంతో ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది.లస్సీ మన బాడీకి తక్షణ శక్తిని కూడా అందిస్తుంది.
8/ 8
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.కానీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కువ చక్కెర వాడితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని డాక్టర్ చెప్పారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)