Diwali 2021 Vastu Tips: దీపాలను ఆ వైపున అస్సలు వెలిగించకండి.. అలా వెలిగిస్తే అరిష్టం.. తెలుసుకోండి
Diwali 2021 Vastu Tips: దీపాలను ఆ వైపున అస్సలు వెలిగించకండి.. అలా వెలిగిస్తే అరిష్టం.. తెలుసుకోండి
దీపావళి(Diwali 2021) పండుగ సందర్భంగా ఇళ్లను దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దీపాలను వాస్తు ప్రకారం(Vastu Tips) సరైన దిశలలో వెలిగించపోతే అరిష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
దీపావళి పండుగను వైభవంగా జరుపుకునేందుకు దేశ ప్రజలంతా సిద్ధమయ్యారు. రంగు రంగుల దీపాలను వెలిగించడం ఈ పండుగ ప్రత్యేకత అన్న విషయం తెలిసిందే. అయితే దీపాలు వెలిగించడానికి ఒక సాంప్రదాయ పద్ధతి ఉంది. ఆ పద్ధతులు పాటించకపోతే శుభప్రదంగా పరిగణించబడదు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
దీపాన్ని ఎప్పుడూ దక్షిణం వైపు తిప్పకూడదు. ఇలా చేస్తే అరిష్టం. దీపావళి నాడు స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయాలి. ఇది ఇంట్లో అందరికీ శ్రేయస్సును ఇస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దీపం వెలిగించడానికి పొద్దుతిరుగుడు నూనెను ఎప్పుడూ ఉపయోగించవద్దు. మొదటి దీపాన్ని పూజ గదిలో వెలిగించడం శుభప్రదం.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
దీపావళి రోజున ఇంట్లోకి లక్ష్మీ, గణేశుడిని స్వాగతించాలంటే ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా దీపాలు ఉంచాలి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
రంగు రంగుల దీపాలు వెలిగించేటప్పుడు, ముఖ్యంగా కాంతులు విరజిమ్మే ఎలక్ట్రిక్ లైట్లను ఉంచే సమయంలో ఏ రంగు దీపాన్ని ఎక్కడ ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
తూర్పు దిక్కు: ఇంటి తూర్పు వైపున ఎరుపు, పసుపు మరియు నారింజ వంటి రంగుల దీపాలు ఉంచడం శుభప్రదం. పడమర వైపు లేత పసుపు, నారింజ, గులాబీ రంగుల దీపాన్ని వెలిగించండి.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఉత్తర దిశలో నీలం, పసుపు మరియు ఆకుపచ్చ దీపాలను ఉంచండి. దక్షిణ దిశలో తెలుపు, ఊదా మరియు ఎరుపు దీపాలు వెలిగిస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.(ప్రతీకాత్మక చిత్రం)